చూయింగ్ గమ్ నమిలి అలా చేస్తే.. రూ.74వేల వరకూ ఫైన్!

ABN , First Publish Date - 2021-11-11T00:28:05+05:30 IST

సాధారణంగా కొంత మంది చూయింగమ్‌ను నమిలి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దాన్ని నమలడం అనే విషయం పూర్తిగా వారి వ్యక్తిగతం అయినప్పటికీ.. నమిలిన చూయింగమ్‌ను డస్ట్‌బిన్‌లో పడేయకుండా.. ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల చా

చూయింగ్ గమ్ నమిలి అలా చేస్తే.. రూ.74వేల వరకూ ఫైన్!

ఎన్నారై డెస్క్: సాధారణంగా కొంత మంది చూయింగ్ గమ్‌ను నమిలి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దాన్ని నమలడం అనే విషయం పూర్తిగా వారి వ్యక్తిగతం అయినప్పటికీ.. నమిలిన చూయింగ్ గమ్‌ను డస్ట్‌బిన్‌లో పడేయకుండా.. ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందిని బహుశా మీరు కూడా ఎదుర్కొనే ఉండొచ్చు. అయితే చూయింగ్ గమ్‌ను నమిలి ఎక్కడ పడితే అక్కడ పడేసే వారిపై ఓ దేశ ప్రభుత్వం సీరియస్ అయింది. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చాలా దేశాలు పారిశుద్ధ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై కఠినంగా ఉంటాయి. కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించి.. ప్రజలు వాటిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటాయి. ఈ క్రమంలోనే సింగపూర్ కూడా.. ప్రజల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు అనేక చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే 1992లో చూయింగ్ గమ్‌ అమ్మకాలపై నిషేధం విధిస్తూ సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2004లో ఈ దీన్ని సవరించిన సింగపూర్ ప్రభుత్వం.. డాక్టర్లు లేక గుర్తింపు పొందిన ఫార్మాసిస్ట్‌లు సిఫారసు చేసిన సందర్భాల్లో చూయింగ్ గమ్‌ను నమిలేందుకు ప్రజలను అనుమతించింది. 



అయితే చూయింగ్ గమ్‌ను నమిలి.. దాన్ని ఎక్కడే పడితే అక్కడ పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. డస్ట్‌బిన్‌లో కాకుండా.. పబ్లిక్ ప్రదేశాల్లో పడేసే వారిపై అధికారులు భారీగా జరిమానాలను విధిస్తున్నారు. మొదటిసారి తప్పు చేస్తే.. రూ.74వేల వరకూ ఫైన్ విధించొచ్చు. ఇక అక్రమంగా చూయింగ్ గమ్‌ను కొనుగోలు చేసి, దాన్ని నమిలి పబ్లిక్ ప్రదేశాల్లో వేసే వారికి లక్ష రూపాయల జరిమానాతోపాటు 2ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.చూయింగ్ గమ్‌ను నమిలి.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లలో ఉండే బటన్స్‌పై, రోడ్లపై, పబ్లిక్ ప్రదేశాల్లో పడేయడం వల్ల.. వాటిని ఆయా ప్రదేశాల్లో శుభ్రం చేయడానికి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది. కొన్ని సందర్భాల్లో ఆయా వస్తువులు పనికి రాకుండా పోతున్నాయి. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 




Updated Date - 2021-11-11T00:28:05+05:30 IST