రోజూ ఖర్జూరాలు తింటే..!

ABN , First Publish Date - 2021-02-24T06:20:14+05:30 IST

రోజూ ఖర్జూరాలు తింటే బోలెడు ఆరోగ్యా ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు...

రోజూ ఖర్జూరాలు తింటే..!

రోజూ ఖర్జూరాలు తింటే బోలెడు ఆరోగ్యా ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు...


  1. కాలేయాన్ని శుభ్రంచేసే గుణాలు ఖర్జూరలో ఉన్నాయి. ఇవి కాలేయాన్ని బలోపేతం చేస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి. వీటిల్లోని  అమినో ఆమ్లాలు, పీచు పదార్థాల వల్ల కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తుంది. 
  2. ఖర్జూరాలు గుండెకు ఎంతో మంచివి. ఖర్జూరాల్లో పొటాషియం బాగా ఉంటుంది. గుండె సంబంధ జబ్బులను నిరోధించడంలో ఇవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.  గుండెపోటు, స్ట్రోక్స్‌ వంటి వాటిని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఖర్జూరాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
  3. ఖర్జూరాల్లో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి కంటిలోని కార్నియాతో పాటు కళ్లను కూడా పరిరక్షిస్తాయి. ఖర్జూరాల్లోని ల్యూటెన్‌, జెక్సాన్‌థిన్‌ వంటి పదార్థాలు అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం కళ్లపై పడకుండా కాపాడతాయి.
  4. స్నాక్స్‌గా బాదం, ఇతర నట్స్‌తో పాటు ఖర్జూరాలను కూడా తింటే ఎంతో మంచిది. ఖర్జూరాల్లోని షుగర్‌ శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. 


ఖర్జూరాల్లో ఉండే మెగ్నీషియం నొప్పులు, వాపును తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను నివారించే యాంటీ బ్యాక్టీరియల్‌ సుగుణాలు ఖర్జూరాల్లో పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఖర్జూరం తప్పనిసరిగా మీ డైట్‌లో ఉండేలా చూసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. 

Updated Date - 2021-02-24T06:20:14+05:30 IST