పెద్దలు చెప్పారని.. ఆహారాన్ని షేర్ చేసుకుని తింటున్నారా? అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేరు!

ABN , First Publish Date - 2022-01-18T17:07:35+05:30 IST

ఏదైనా పంచుకుని తినాలని, అప్పుడే ప్రేమ పెరుగుతుందనే..

పెద్దలు చెప్పారని.. ఆహారాన్ని షేర్ చేసుకుని తింటున్నారా? అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేరు!

ఏదైనా పంచుకుని తినాలని, అప్పుడే ప్రేమ పెరుగుతుందనే మాట మనమంతా చిన్నప్పటి నుంచి వింటూవుంటాం. ఆహార పదార్థాలు తినే విషయంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, స్నేహితుల మధ్య గొడవలు రాకూడదని తల్లిదండ్రులు, సంరక్షకులు, పెద్దలు ఈ సంగతి చెబుతూ ఉంటారు. చాలా వరకు ఇది నిజం కూడా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరో పరిశోధనల ఫలితాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం అందరూ కలిసి తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. ఈ పరిశోధనల ఫలితాలు ‘కన్స్యూమర్ సైకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. డైలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం ఆహారాన్ని పంచుకుని ద్వారా తినడం వల్ల బరువు పెరుగుతారని కెనడియన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 




ఈ సందర్భంగా కెనడియన్ శాస్త్రవేత్తలు నఖెత్ టేలర్, థియోడర్ నోజ్‌వార్డి మాట్లాడుతూ.. మనమంతా తరచూ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో రెస్టారెంట్‌లకు వెళ్లి ఆహార పదార్థాలను కలసి తింటుంటాం. ఇలా చేయడం వల్ల శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయి. ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతారు. ఈ పరిశోధన కోసం, శాస్త్రవేత్తలు 719 మందిపై మూడు రకాల ఆహారపు ప్రవర్తన ప్రయోగాలను నిర్వహించారు. మొదటి ప్రయోగంలో ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతోపాటు ఒకే ప్లేట్‌లో చిప్స్ తినడం వల్ల బరువు పెరుగుతారని తేలింది. అదే విడిగా ప్లేట్‌లలో చిప్స్ తింటే తక్కువ బరువు పెరుగుతున్నట్లు వారు గుర్తించారు. ఒంటరిగా తినేకన్నా పదిమందితో కలసి ఏదైనా ఆహారాన్ని పంచుకుని తింటే అదనంగా 3 శాతం బరువు పెరుగుతారని తేలింది. ఒకే ప్లేటులోని చిప్స్ లేదా ఇతర ఆహార పదార్థాలను తిన్నప్పుడు ఎంత తింటున్నామో అర్థం చేసుకోలేమని పరిశోధకులు తెలిపారు. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు ఇతరులతో పంచుకోవడం ద్వారా ఎక్కువ కేలరీలు తీసుకుంటామని తద్వారా బరువు పెరుగుతామని ఈ అధ్యయనంలో తేలింది.  కలిసితినే సందర్భంలో ఆహారంలో నెయ్యి-నూనె ఎంతశాతం ఉందో కూడా ఆలోచించరని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒంటరిగా భోజనం చేసేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు.. అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు తీసుకోకపోవడం కారణంగా బరువు పెరుగుతామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-01-18T17:07:35+05:30 IST