డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి ఈటన్‌ ఫార్మా ఇంజెక్టబుల్స్‌

ABN , First Publish Date - 2022-06-25T09:29:30+05:30 IST

అమెరికాలోని ఇల్లినాయి్‌సకు చెందిన ఈటన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌.

డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి ఈటన్‌ ఫార్మా ఇంజెక్టబుల్స్‌

డీల్‌ విలువ రూ.375 కోట్లు 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాలోని ఇల్లినాయి్‌సకు చెందిన ఈటన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌.. బ్రాండెడ్‌, జెనరిక్‌ ఇంజెక్టబుల్స్‌ పోర్టుఫోలియోను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కొనుగోలు చేసింది. ‘బయోఫెన్‌’, ‘రెజిప్రెస్‌’ వంటి బ్రాండెడ్‌ ఇంజెక్టబుల్స్‌ ఉత్పత్తులు ఇందులో ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ఒప్పందం ప్రకారం ఈ ఇంజెక్టబుల్స్‌ ఉత్పత్తులను చేజిక్కించుకోవడానికి ముందుగా డాక్టర్‌ రెడ్డీస్‌ 50 లక్షల డాలర్లు చెల్లించింది. భవిష్యత్తులో 4.5 కోట్ల డాలర్ల వరకూ కంటిజెంట్‌ పేమెంట్స్‌గా చెల్లిస్తుంది. మొత్తం విలువ 5 కోట్ల డాలర్లు (దాదాపు రూ.375 కోట్లు).

ఇండివియర్‌తో సెటిల్‌మెంట్‌: మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిలో చికిత్సకు వినియోగించే జెనరిక్‌ బుప్రెనోర్‌ఫిన్‌, నలాక్సాన్‌ సబ్‌లింగ్యువల్‌ ఫిల్మ్‌లకు సబంధించి ఇండివియర్‌ ఇంక్‌, అక్వెస్టివ్‌ థెరాపుటిక్స్‌తో ఉన్న వివాదాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ పరిష్కరించుకుంది. సెటిల్‌మెంట్‌ ఒప్పందం ప్రకారం డాక్టర్‌ రెడ్డీ్‌సకు 2024 మార్చి 31 నాటికి 7.2 కోట్ల డాలర్లు (దాదాపు రూ.560 కోట్లు) లభిస్తాయి. ఒప్పందం పరిధిలోకి ఇండివియర్‌, అక్వెస్టివ్‌ థెరప్యుటిక్స్‌ చేసిన పేటెంట్‌ ఇన్‌ఫ్రింజ్‌మెంట్‌ ఆరోపణలు కూడా వస్తాయని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. 

దేశీయ మార్కెట్లో: దేశీయ మార్కెట్లో ఐదో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదగాలని డాక్టర్‌ రెడ్డీస్‌ భావిస్తోంది. ఇందుకు క్రానిక్‌ థెరపీ విభాగంపై దృష్టి కేంద్రీకరించనుంది. అయితే.. అమెరికా కీలక మార్కెట్‌గా కొనసాగుతుందని ‘ఇన్వెస్టర్స్‌ డే’ ప్రజెంటేషన్‌లో పేర్కొంది. 

Updated Date - 2022-06-25T09:29:30+05:30 IST