ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-03-07T06:41:34+05:30 IST

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
చిలకలపూడి పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎన్నికల పరిశీలకులు సుబ్రహ్మణ్యం

 పరిశీలకులు సుబ్రహ్మణ్యం

మచిలీపట్నం టౌన్‌, మార్చి 6 : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు.  చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూల్‌, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను శనివారం పరిశీలించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ శివరామకృష్ణ, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నాగశాస్ర్తులు, డీఈ గుప్తాతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.


 అప్రమత్తంగా వ్యవహరించాలి 

ఎన్నికల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ అన్నారు. హిందూ కళాశాల ఆడిటోరియంలో శనివారం పీవోలు, ఏపీవోలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పరిశీలకులు సుబ్రహ్మణ్యం శిక్షణ కార్యక్రమాలను పరిలించారు. 133 పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్‌వోలు లలితామోహన్‌, శంకరనాథ్‌, దుర్గాప్రసాద్‌, మోమిన్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-07T06:41:34+05:30 IST