ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో 32.96% సీట్ల భర్తీ

ABN , First Publish Date - 2020-12-01T15:18:47+05:30 IST

ఈ నెల 26 నుంచి ప్రాంభమైన రెండో విడత..

ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో 32.96% సీట్ల భర్తీ

అమరావతి: ఈ నెల 26 నుంచి ప్రాంభమైన రెండో విడత ఏపీ ఈసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 19,245  (32.96ు) సీట్లు భర్తీ అయ్యాయి. ఈసెట్‌లో మొత్తం 30,662 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా, వీరిలో 1713 మంది రెండో దశలో రిజిస్టరయ్యారు. 2572 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 10,787 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో కొత్తగా 4636 మందికి   ప్రవేశాలు లభించాయి. 2342 మంది స్లైడింగ్‌ అయ్యారు. రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం చూస్తే.. రాష్ట్రంలోని మొత్తం 407 ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలకు కలిపి కన్వీనర్‌ కోటాలో మొత్తం 58,387 సీట్లు అందుబాటులో ఉండగా 19,245 సీట్లు భర్తీ అయ్యాయని, మరో 39,142 సీట్లు మిగిలిపోయాయని ఈసెట్‌ కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-12-01T15:18:47+05:30 IST