తహసీల్దార్‌ కార్యాలయ పనులకు గ్రహణం

ABN , First Publish Date - 2021-10-18T04:59:06+05:30 IST

చాగలమర్రిలోని తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది.

తహసీల్దార్‌ కార్యాలయ పనులకు గ్రహణం
బేస్‌మెంట్‌తో నిలిచిన తహసీల్దార్‌ కార్యాలయ భవన పనులు

చాగలమర్రి, అక్టోబరు 17: చాగలమర్రిలోని తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. రూ.98 లక్షలతో గత ప్రభుత్వ హయాంలో భవన పనులు ప్రారంభించారు. నాటి నుంచి పిల్లర్లకే పరిమితమయ్యాయి. పిల్లర్ల వరకు పనులు చేసి అసంపూర్తిగా వదిలేశారు. పిచ్చి మొక్కలతో నిండిపోయింది. భవన పనులు చేపట్టిన కాంట్రక్టర్‌కు బిల్లులు అందకపోవడంతో పనులు చేయకుండా వదిలేసినట్లు సమాచారం. తహసీల్దార్‌ కార్యాలయం భవన పనులు పూర్తి చేయకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తు న్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత ఏడాది పిల్లర్ల వరకే పరిమితం చేసిన పనులను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భవన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తహసీల్దార్‌ కార్యాలయ భవన పనులు అసంపూర్తిగా నిలిచిన మాట వాస్తవమేనని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారం భించేలా చూస్తామని అన్నారు.

Updated Date - 2021-10-18T04:59:06+05:30 IST