భువన్‌లో అ‘ద్వితీయం’

ABN , First Publish Date - 2021-09-17T05:57:37+05:30 IST

భువన్‌లో అ‘ద్వితీయం’

భువన్‌లో అ‘ద్వితీయం’

  • ఇళ్ల జియోట్యాగింగ్‌లో  రాష్ట్ర స్థాయిలో పరిగికి రెండోస్థానం
  • 6వ స్థానంలో కొడంగల్‌ .. 12వ స్థానంలో వికారాబాద్‌
  • 110వ స్థానంలో .. తాండూరు మున్సిపాలిటీ
  • మూడు మున్సిపాలిటీల్లో 90 శాతం సర్వే పూర్తి

12వ స్థానంలో వికారాబాద్‌

వికారాబాద్‌ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో  నిలిచింది. మున్సిపాలిటీలో 13,886 ఇళ్లకు గాను 12,627 ఇళ్లు జియోట్యాగింగ్‌ చేసి 90.93 శాతం పూర్తి చేశారు. ఇంకా 1,259 ఇళ్లు జియోట్యాగింగ్‌ చేయాల్సి ఉంది.  15రోజుల్లో వందశాతం పూర్తి చేసేలా మున్సిపల్‌ అధికారులు  చర్యలు చేపడుతున్నారు. 

110వ స్థానంలో.. 

పూర్తిస్థాయి కంటే ఎక్కువ స్టాఫ్‌ ఉన్న తాండూరు మున్సిపాలిటీలో భువన్‌ సర్వేలో అధోగతిలో ఉంది. రాష్ట్రంలో 141 మున్సిపాలిటీల్లో తాండూరు మున్సిపాలిటీ 110వ స్థానంలో నిలిచింది. కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీలు రెవెన్యూ విభాగానికి చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, రెవెన్యూ ఆఫీసర్స్‌, పూర్థిస్థాయిలో బిల్‌ కలెక్టర్లు లేకున్నా టాప్‌-10లో నిలిచాయి. తాండూరు మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్స్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, దాదాపు 10 మంది బిల్‌ కలెక్టర్లు పూర్తిస్థాయిలో స్టాఫ్‌ ఉన్నప్పటికీ భువన్‌ సర్వేనత్తనడకన సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో 12,525 అసె్‌సమెంట్‌(ఇళ్లు)ఉండగా, ఇప్పటి వరకు 4,271 ఇళ్లు పూర్తి చేసి 34.10 శాతం సాధించారు. నిధులున్నా యంత్రాంగం ఉండి కూడా భువన్‌సర్వే చేయడంలో విఫలమయ్యారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కమిషనర్‌ సూచనలు లేని కారణంగానే సర్వే చేయడంలో సిబ్బంది పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా 8,254ఇళ్లు మిగిలి ఉన్నాయి.

Updated Date - 2021-09-17T05:57:37+05:30 IST