మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-24T06:27:21+05:30 IST

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌ చేయూత మూడో విడత చెక్కుల పంపిణీని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు.

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
చెక్కు విడుదల చేస్తున్న కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే

కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కుల పంపిణీ

మార్కాపురం సెప్టెంబరు 23: మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌ చేయూత మూడో విడత చెక్కుల పంపిణీని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూతలో భాగంగా జిల్లాలో 99,012 మంది మహిళలకు రూ.185.64 కోట్లు జమచేస్తోందన్నారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.కనకారావు, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస విశ్వనాధ్‌, డీఎల్‌డీవో సాయికుమార్‌,  అధికారులు పాల్గొన్నారు. 

జిల్లా వైద్యశాలలో మెరుగైన సేవలకు కృషి

అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌లు మార్కాపురం వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అవసరాలను అధికారులతో చర్చించారు. ప్రైవేటు సంస్థల నుంచి సరఫరా చేసే మందులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు, ఆసుపత్రిలో చేపట్టిన విద్యుత్‌ మరమ్మతు పనులకు బిల్లులను హెచ్‌డీఎస్‌ నిధుల నుంచి చెల్లింపు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఆసుపత్రిని ఆనుకొని ఉన్న జంకె రామిరెడ్డి కాలనీలో నుంచి మురుగునీరు ఆసుపత్రిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఎంపీడీవో తోటా చందనను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో అవసరమైన రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు డాక్టర్‌, ఇతర సిబ్బందిని త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు.  కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ ఎస్‌.ఎన్‌.మూర్తి, ఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ రవి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.సుబ్బారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల పరిశీలన

జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కోరారు. మండలంలోని ఇడుపూరు-3 లే అవుట్‌ను ఆయన పరిశీలించారు. లే-అవుట్‌లో తాగునీటి సదుపాయం, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.30 వేలు అదనపు రుణం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ పేరయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:27:21+05:30 IST