RTO Jabalpur Raid: దేశం ఎటు పోతోంది దేవుడా.. ఒక ఆర్‌టీఓ ఇల్లే ఇలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-08-19T18:54:02+05:30 IST

మన దేశాన్ని రాజకీయ నాయకులు దోచేస్తున్నారనే మాట ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో చెవిన పడే ఉంటుంది. అయితే.. రాజకీయ నాయకులతో..

RTO Jabalpur Raid: దేశం ఎటు పోతోంది దేవుడా.. ఒక ఆర్‌టీఓ ఇల్లే ఇలా ఉందంటే..

జబల్‌పూర్: మన దేశాన్ని రాజకీయ నాయకులు దోచేస్తున్నారనే మాట ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో చెవిన పడే ఉంటుంది. అయితే.. రాజకీయ నాయకులతో పోటీ పడి మరీ ‘మేమేమన్నా తక్కువ తిన్నామా’ అన్న చందంగా కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కూడా దేశాన్ని దోచుకోవడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.



10,000 స్వ్కేర్ ఫీట్ల విలాసవంతమైన ఇల్లు.. ఆ ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్, ఖరీదైన jacuzzi బాత్‌‌టబ్, మినీ బార్, హోం థియేటర్, ఇంట్లోనే సంతోష్ పాల్‌కు ప్రత్యేకంగా ఆఫీస్ వసతి.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అది ఇల్లా.. ఇంద్ర భవనమా అనే రీతిలో వసతులు ఉన్నాయంటే అయ్యగారు ఏ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టారో అర్థం చేసుకోవచ్చు.


ఆ భార్యాభర్తల సంపాదనతో పోలిస్తే వారి ఆస్తులు 650 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఈఓడబ్ల్యూ ఎస్పీ దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి జరిగిన ఈ సోదాల్లో 16 లక్షల డబ్బు, ఆభరణాలు, కొన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అవినీతి సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ భార్యాభర్తలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



సంతోష్ పాల్ భార్య లేఖా పాల్ కూడా అతను ఆర్టీఓగా (rto jabalpur) పనిచేస్తున్న ఆర్టీఓ ఆఫీస్‌లోనే క్లర్క్‌గా పనిచేస్తోంది. సంతోష్ పాల్‌పై, అతని భార్యపై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతని ఇంట్లో (rto jabalpur house) వసతులు చూశాక ఫ్యూజులు ఎగిరిపోయినంత పనయింది. ఒక విలాసవంతమైన 5 స్టార్ హోటల్‌లో ఏ వసతులు ఉంటాయో ఆ వసతులన్నీ సంతోష్ పాల్ (rto jabalpur mp) ఇంట్లో కనిపించే సరికి ఈఓడబ్ల్యూ అధికారులు అవాక్కయ్యారు.



ఇందుకు తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో (rto jabalpur news) వెలుగుచూసిన ఓ ఆర్టీఓ అధికారి నిర్వాకమే నిదర్శనం. ఆర్థిక నేర విభాగం (Economic Offences Wing) అధికారులు ఆగస్ట్ 18న జబల్‌పూర్ నగరంలోని ఆర్టీఓ అధికారి సంతోష్ పాల్ (rto jabalpur santosh pal) ఇంట్లో సోదాలు చేశారు.



విచారణలో తేలిన మరో దిమ్మతిరిగే విషయం ఏంటంటే.. ఈ భార్యాభర్తలకు మొత్తం ఐదు సొంత ఇళ్లు ఉన్నాయని తెలిసింది. ఒక ఫామ్ హౌస్ కూడా ఉందని అధికారులు తేల్చారు. ఖరీదైన కారు, ఒక SUV, రెండు ఖరీదైన టూవీలర్లు ఉన్నట్లు ఈడబ్ల్యూఓ అధికారుల విచారణలో వెల్లడైంది.

Updated Date - 2022-08-19T18:54:02+05:30 IST