మరో ఉద్దీపన ప్యాకేజీ కావాల్సిందే!

ABN , First Publish Date - 2021-05-07T06:38:18+05:30 IST

పారిశ్రామిక, వాణిజ్య సంఘాల నోట మళ్లీ ఉద్దీపన ప్యాకేజీ మాట వినిపిస్తోంది. కరోనా రెండో ఉధృతితో ఆర్థిక వ్యవస్థకు మళ్లీ తీవ్ర కష్టాలు ప్రారంభమయ్యాయని పారిశ్రామిక రంగ సమాఖ్య...

మరో ఉద్దీపన ప్యాకేజీ కావాల్సిందే!

  • ఆర్థిక వ్యవస్థకు మళ్లీ కొవిడ్‌ తిప్పలు పీహెచ్‌డీసీసీఐ చాంబర్‌

న్యూఢిల్లీ: పారిశ్రామిక, వాణిజ్య సంఘాల నోట మళ్లీ ఉద్దీపన ప్యాకేజీ మాట వినిపిస్తోంది. కరోనా రెండో ఉధృతితో ఆర్థిక వ్యవస్థకు మళ్లీ తీవ్ర కష్టాలు ప్రారంభమయ్యాయని పారిశ్రామిక రంగ సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం తప్పనిసని స్పష్టం చేసింది. ఈ ప్యాకేజీ చెప్పుకోదగ్గ స్థాయిలో భారీగానే ఉండాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు మొత్తం 17 సూచనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు  లేఖ రాసింది. పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పరోక్షం గా జాతీయ స్థాయిలో లాక్‌డౌన్లు వద్దని కోరింది. అలాంటి చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు తప్పదని హెచ్చరించింది. 



ప్రధాన సూచనలు

  1. ఎంఎ్‌సఎంఈలను మరింతగా ఆదుకోవాలి 
  2. అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ఈసీజీఎల్‌ఎస్‌) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలి
  3. ఈసీజీఎల్‌ఎస్‌ పథకం కేటాయింపుల్ని ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెంచాలి
  4. కొవిడ్‌ సద్దుమణిగే వరకు ఐటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయవద్దు
  5. 2021-22 ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్‌ రేటును 50 శాతం తగ్గించాలి
  6. చైనాకు స్టీల్‌ ఎగుమతులపై నిషేధం
  7. స్టీల్‌ ఎగుమతులపై  35 శాతం సుంకం విధించాలి
  8. అన్ని రకాల ఇనుప ఖనిజం ఎగుమతులపై ఒకే సుంకం విధించాలి
  9. ‘ఆయుష్‌’ పరిశ్రమ ఉత్పత్తులపై జీఎ్‌సటీ తగ్గించాలి
  10. బ్యాంకుల్లో చార్జీల రహిత నగదు డిపాజిట్‌ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి
  11. స్వంచ్ఛంద లైసెన్స్‌ పద్దతిలో ఇతర కంపెనీలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల ఉత్పత్తి చేపట్టేందుకు అనుమతించాలి 

Updated Date - 2021-05-07T06:38:18+05:30 IST