heart attack: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-30T13:32:43+05:30 IST

ప్రముఖ ఆర్థికవేత్త(Economist), భారత ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు(former Planning Commission member) అభిజిత్ సేన్(Abhijit Sen) సోమవారం రాత్రి...

heart attack: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త(Economist), భారత ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు(former Planning Commission member) అభిజిత్ సేన్(Abhijit Sen) సోమవారం రాత్రి కన్నుమూశారు. 72 ఏళ్ల అభిజిత్ సేన్ కు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు(heart attack) వచ్చింది. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని, కానీ అప్పటికే అభిజిత్ సేన్ మరణించారని అతని సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ చెప్పారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అభిజిత్ సేన్ నాలుగు దశాబ్దాల పాటు ఆర్థికశాస్త్రాన్ని బోధించారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన అభిజిత్ వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ (Commission of Agricultural Cost and Prices)ఛైర్మన్ గా కూడా పనిచేశారు. 


గ్రామీణ ఆర్థికవ్యవస్థ నిపుణుడైన అభిజిత్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు. బెంగాలీ కుటుంబానికి చెందిన సేన్ స్టీఫెన్స్ కళాశాలలో ఫిజిక్స్ హానర్స్ చదివి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో(University of Cambridge) ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేశారు. 2004 నుంచి 2014వ సంవత్సరం వరకు అప్పటి ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్(Manmohan Singh) నేతృత్వంలో కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. ఆర్థికవేత్త మృతిపై పలువురు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Updated Date - 2022-08-30T13:32:43+05:30 IST