ఈ-క్రాప్‌ పక్కాగా నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-08-18T04:32:42+05:30 IST

ఈ-క్రాప్‌ పంట నమోదు వివరాలు పక్కాగా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు.

ఈ-క్రాప్‌ పక్కాగా నమోదు చేయాలి
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా


రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 17: ఈ-క్రాప్‌ పంట నమోదు వివరాలు పక్కాగా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఖరీఫ్‌-2022 ఈ-క్రాప్‌ బుకింగ్‌పై తహసీల్దార్‌లు, మండల వ్యవసాయాధికారులు, హార్టికల్చర్‌ అధికారులు, వీఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ పంట నమోదు వివరాలు ఈనెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. ఈనె 16వ తేదీ నుంచి నమోదు వివరాలు చేస్తున్నారన్నారు. గతంలో వీఆర్‌వోలు మాత్రమే పంట నమోదు వివరాలు సేకరించే వారిని ప్రస్తుతం జాయింట్‌ అజమాయిషీ కింద  వీఆర్‌వోలు, రైతు భరోసా కేంద్రాల ఇన్‌చార్జిలు సమన్వయంతో పంట నమోదు వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి తహసీల్దార్‌లు, వీఆర్‌వోలను ఫీల్డ్‌కు పంపి వివరాలు పక్కాగా చేసే విధంగా మానిటర్‌ చేయాలన్నారు. పంట నమోదు చేసుకోవడం వల్ల పంట రుణాలు, వైఎ్‌సఆర్‌ ఉచిత పంటల బీమా, రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ఽధరకు అమ్ముకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రతి రైతు ఈ-క్రాప్‌ పంట నమోదుకు సంబంధించి గ్రామ స్థాయి అధికారులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, ఏవో బాలకృష్ణ, వ్యవసాయాధికారి వెంకటకృష్ణ, కలెక్టరేట్‌ కో-ఆర్డినే షన్‌ విభాగపు తహసీల్దార్‌ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T04:32:42+05:30 IST