సత్యేంద్ర జైన్ అరెస్టు ఆలోచనలో ఈడీ : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-23T19:24:22+05:30 IST

ఆప్ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేయనున్నట్టు..

సత్యేంద్ర జైన్ అరెస్టు ఆలోచనలో ఈడీ : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేయనున్నట్టు విశ్వసనీయంగా తనకు తెలిసిందని ఆ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ఎన్నికలకు ముందు ఈ అరెస్టు ఉండవచ్చనే సమాచారం ఉందని చెప్పారు.


''కేంద్ర దర్యాప్తు సంస్థలు కోరుకుంటే నాతో పాటు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఇలాంటి అరెస్టులకు మేము భయపడేది లేదు. మోదీ ప్రభుత్వం పంజాబ్ ఎన్నికలకు ముందు మంత్రిని అరెస్టు చేయాలనుకుంటోంది. వారు ఈడీని, సీబీఐ, ఇతర సంస్థలను పంపుతున్నారు. నాతో సహా ఎవరిని అరెస్టు చేయాలనుకున్నా వారు చేసుకోవచ్చు. మేము చేసిన తప్పేమీ లేదు. భయపడేది కూడా లేదు. చిరునవ్వుతోనే వారిని స్వాగతిస్తాం'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-23T19:24:22+05:30 IST