Delhi Liquor Scamలో ఈడీ విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-06T15:59:21+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించింది.

Delhi Liquor Scamలో ఈడీ విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించింది. మంగళవారం ఉదయం దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు జరుపుతున్న విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) సహా మరో 5 గురుపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.


రాబిన్ డిస్ట్రిలర్స్ పేరుతో రామచంద్రన్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు చేపట్టింది. రామచంద్రన్‌తో పాటు బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి. కాగా... ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో జరగడం లేదని ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2022-09-06T15:59:21+05:30 IST