వివో, అనుబంధ చైనీస్ మొబైల్ కంపెనీలలో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-07-05T22:02:41+05:30 IST

చైనీస్ టాప్ మొబైల్ తయారీదారు వివో(VIVO), దాని అనుబంధ సంస్థలపై ఈడీ(ED) మంగళవారం సోదాలు(Raids) నిర్వహించింది.

వివో, అనుబంధ చైనీస్ మొబైల్ కంపెనీలలో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: చైనీస్ టాప్ మొబైల్ తయారీదారు వివో(VIVO), దాని అనుబంధ సంస్థలలో ఈడీ(ED) మంగళవారం సోదాలు(Raids) నిర్వహించింది. మనీల్యాండరింగ్ నిబంధనల (money laundering acts) ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కింద నార్త్ ఇండియాలోని 44 ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. వివోపై ఇప్పటికే ఎన్ఐఏ(NIA) దర్యాప్తు జరుపుతుండగా.. ఆర్థిక లావాదేవీల్లో ఉల్లంఘనల నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మంగళవారం సోదాలు చేపట్టింది.


చైనాతో సంబంధాలున్న కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో గత మే నెలలో చైనా కంపెనీలు జెడ్‌టీఈ(ZTE), వివో మొబైల్ కమ్యూనికేషన్స్‌పై దర్యాప్తు జరిగిన విషయం తెలిసిందే. యాజమాన్యం, ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఉల్లంఘనల ఆరోపణల దృష్ట్యా ఈ సోదాలు జరిగినట్టు పలు మీడియా రిపోర్టులు అప్పట్లో పేర్కొన్నాయి. దీంతో చైనా కంపెనీలపై నిఘా మరింత పెరిగింది. కాగా అంతక్రితం 2020 చైనా- భారత్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో చైనీస్ కంపెనీలపై భారత ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగింది. ఆ సమయంలో 200లకుపైగా మొబైల్ యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజాధరణ పొందిన టిక్‌టాక్ యాప్‌పై కూడా వేటుపడిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-05T22:02:41+05:30 IST