బ్రేకింగ్ : JC Prabhakar Reddy ఇంట్లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-06-17T14:38:40+05:30 IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ దివాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ముఖ్య అనుచరుడు...

బ్రేకింగ్ : JC Prabhakar Reddy ఇంట్లో ఈడీ సోదాలు

అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)తో పాటు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్ల(Cell Phones)ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు. 

Updated Date - 2022-06-17T14:38:40+05:30 IST