మనీలాండరింగ్ కేసులో మెహబూబా ముఫ్తీ సోదరుడికి ఈడీ summons

ABN , First Publish Date - 2021-11-18T13:52:37+05:30 IST

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీకి...

మనీలాండరింగ్ కేసులో మెహబూబా ముఫ్తీ సోదరుడికి ఈడీ summons

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం విచారణకు పిలిచింది.జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీ నేడు న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ ఆదేశించింది.తస్సాదుక్ హుస్సేన్‌ ఖాతాల్లోకి జమ్మూ కశ్మీర్‌లో ఉన్న కొంతమంది వ్యాపారవేత్తల నుంచి వచ్చిన నిధులకు సంబంధించి ప్రశ్నిస్తామని ఈడీ అధికారులు చెప్పారు. 


కేంద్రప్రభుత్వ తప్పులకు వ్యతిరేకంగా తాను మాట్లాడినప్పుడల్లా తన కుటుంబంలో ఒకరికి సమన్ వస్తుందని, ఈ సారి తన సోదరుడికి ఈడీ సమన్లు పంపించిందని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. గతంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముఫ్తీ తల్లి గుల్షన్ నజీర్‌కు ఈడీ ఈ ఏడాది జులైలో సమన్లు ​​జారీ చేసింది. మెహబూబా విమర్శల తర్వాత ఆమె సహచరుడిపై దాడులు చేసిన తర్వాత కేంద్ర ఏజెన్సీ రెండు డైరీలను రికవరీ చేసింది. డైరీల్లో నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి విచక్షణా నిధి నుంచి చేసిన చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయని పేర్కొంది.మరో మనీలాండరింగ్ కేసులో మెహబూబానే కేంద్ర ఏజెన్సీ ప్రశ్నించింది.కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన పౌర హత్యలపై మెహబూబా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో గృహనిర్బంధంలో ఉంచారు.


Updated Date - 2021-11-18T13:52:37+05:30 IST