Former Chief Minister: ప్రధాన కార్యదర్శి ఎన్నికలపై ఈపీఎస్‌ దృష్టి

ABN , First Publish Date - 2022-09-27T14:19:10+05:30 IST

అన్నాడీఎంకేను ఇప్పటికే చేజిక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswam

Former Chief Minister: ప్రధాన కార్యదర్శి ఎన్నికలపై ఈపీఎస్‌ దృష్టి

- పలువురు నేతలతో భేటీ

- పార్టీ కార్యాలయంలో మళ్లీ సందడి


చెన్నై, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేను ఇప్పటికే చేజిక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami).. ఆ పార్టీకి శాశ్వత అధినేతగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీకి ఆయన తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉండగా, త్వరలోనే పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ మేరకు సోమవారం ఉదయం పార్టీ సీనియర్లతో ఈపీఎస్‌ సమగ్రంగా చర్చించారు. సోమవారం రాయపేటలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైకి వచ్చిన ఈపీఎస్(EPS)కు ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈపీఎస్‌ పార్టీ నేతలను కలుసుకోనున్నట్లు ఆదివారం సాయంత్రం నేతలకు ఆకస్మికంగా సందేశాలు పంపడంతో ఆ మేరకు నేతలు ఉదయం 8 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈపీఎస్‌ పార్టీ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే పార్టీ కార్యకర్తలు, ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈపీఎస్‌ కార్యాలయంలోపలకు వెళ్ళి ఇటీవల మరమ్మతు చేసిన గదులను పరిశీలించి, కొత్తగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ ను పరిశీలించారు. ఆ తర్వాత సమావేశ మందిరంలో పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్నికల ఇన్‌చార్జ్‌లు పొన్నయ్యన్‌, నత్తం విశ్వనాథన్‌, వివిధ జిల్లాల కార్యదర్శులు బాలగంగా, విరుగై రవి, రాజేష్‌, వెంకటే్‌షబాబు, కేపీ కందన్‌, చీట్లపాక్కం రాజేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. జూలై 11న జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో పార్టీ తాత్కాళిక ప్రదాన కార్యదర్శిగా ఎంపికైన సందర్భంగా నాలుగు నెలల్లోగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని ఈపీఎస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ఎన్నికలను నిర్వహించే బాధ్యతలను సి. పొన్నయ్యన్‌, నత్తం విశ్వనాథన్‌లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమైన ఈపీఎస్‌ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిపే తేదీ ఖరారు చేసే విషయమై చర్చించారు. ఆ తర్వాత మాజీ మంత్రి డి. జయకుమార్‌(Former Minister D. Jayakumar) సహా మాజీ మంత్రులతో ఈపీఎస్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. 



Updated Date - 2022-09-27T14:19:10+05:30 IST