నూతన జాతీయ విద్యావిధానంతో మేలు

ABN , First Publish Date - 2022-06-29T05:55:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో నూతన జాతీయ విద్యావిధానం - 2020 అమలుపై అన్ని వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్‌లతో మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

నూతన జాతీయ విద్యావిధానంతో మేలు
మాట్లాడుతున్న ఉన్నత విధ్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జె.శ్యామలరావు

ఉన్నత విధ్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జె.శ్యామలరావు

పెదకాకాని, జూన్‌ 28: ఆంధ్రప్రదేశ్‌లో నూతన జాతీయ విద్యావిధానం - 2020 అమలుపై అన్ని వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్‌లతో మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రెండ్రోజుల పాటు ఈ సెమినార్‌ జరగనుంది. ఏపీ ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్‌లు పాల్గొన్నారు. ఆయా వర్సిటీలలో విద్యా ప్రమాణాలు, బోధన, పరిశోధనలు, అధునాతన విద్యా విధానం వంటి అంశాలపై ఆయా వర్సిటీల తరపున వీసీలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. అధునాతన విద్యావిధానాన్ని అమలు చేయడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని, విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దవచ్చని పలువురు వీసీలు సూచించారు. నూతన జాతీయ విద్యావిధానం అమలు చేయాల్సిన ఆవశ్యకతను సూచించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, సంయుక్త కార్యదర్శి సునీల్‌రెడ్డి, వీసీ ఆచార ్య పి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T05:55:16+05:30 IST