Education: తెలంగాణలో విద్యాసంస్థల వ్యాపారానికి కారణం ఎవరు?

ABN , First Publish Date - 2022-08-07T16:01:33+05:30 IST

పిల్లల్ని బడులకు పంపాలంటే తల్లిందండ్రులకు చెమటలు పడుతున్నాయి.

Education: తెలంగాణలో విద్యాసంస్థల వ్యాపారానికి కారణం ఎవరు?

హైదరాబాద్ (Hyderabad): పిల్లల్ని బడులకు పంపాలంటే తల్లిందండ్రులకు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏ ఫీజు (fee) అడుగుతారో? అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ విద్యను అందించాల్సిన స్కూల్స్ స్టేషనరీ షాపులుగా ఎందుకు మారుతున్నాయి? అసలు విద్యా వ్యవస్థలో లోపాలకు కారణం ఎవరు? ఎడ్యుకేషన్ అంటే నాన్ ప్రాఫిట్ బిజినెస్. కానీ పాలకులు, విద్యా సంస్థల యజమానులు కలిసి దాన్నో వ్యాపార వస్తువుగా చేశారు. పిల్లల్ని స్కూల్లో వేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎల్‌కేజీ పిల్లలకు కూడా వేలాది ఫీజులు వసూలు చేయడమే కాకుండా యూనిఫాం, పుస్తకాలు.. చివరికి స్టేషనరీ వస్తువులు కూడా తమ వద్దనే కొనాలని కండిషన్ పెడుతున్నారు. ఇలాంటి చెత్త ఖండిషన్లపై అటు పేరెంట్స్ నుంచి ఇటు విద్యార్థి సంఘాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


కొన్ని స్కూల్స్ అయితే  తమ దగ్గర యూనిఫాం, పుస్తకాలు కొంటేనే అడ్మిషన్ ఇవ్వాలని తేల్చి చెబుతున్నాయి. పాఠశాలల తీరుపట్ల పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా ఇవ్వాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు సాహసం చేసి ఇదేంటని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ల పిల్లలను టీచర్లు పలు రకాలుగా ఇబ్బందిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ అంతా ఒక్కటే అయినప్పుడు ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన పుస్తకాలు కనిపించడం ఏంటో ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న.. పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివించడం ఈ రోజుల్లో పెద్ద సాహసమే అవుతోంది.

Updated Date - 2022-08-07T16:01:33+05:30 IST