తీరంలో విద్యా కమిటీ బృందం పర్యటన

ABN , First Publish Date - 2021-06-22T04:58:22+05:30 IST

: ప్రభుత్వం నియోజకవర్గంలో రెండు జూని యన్‌ కళాశాలను ఏర్పాటు చేయనుందని బృందం నిర్వాహకుడు అప్పారావు తెలిపారు.

తీరంలో విద్యా కమిటీ బృందం పర్యటన
కాపులగొడపలో పరిశీలిస్తున్న విద్యా కమిటీ బృందం

జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు స్థల పరిశీలన

నరసాపురం రూరల్‌, జూన్‌ 21 : ప్రభుత్వం నియోజకవర్గంలో రెండు జూని యన్‌ కళాశాలను ఏర్పాటు చేయనుందని బృందం నిర్వాహకుడు అప్పారావు తెలిపారు. ఈ మేరకు తీర ప్రాంతంలో సోమవారం ముగ్గురు సభ్యులతో కూడిన విద్యా కమిటీ బృందం పర్యటించింది. మండలంలోని కొప్పర్రు, తూర్పు తాళ్ళు, కాపులగొడప, మొగల్తూరు మండలం కేపీపాలెం, పేరుపాలెం, మొగ ల్తూరు హైస్కూళ్లను పరిశీలించారు. జూనియన్‌ కళాశాలలకు అనువుగా ఉన్న ప్రాంతాలను, సదుపాయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించాల  న్నారు. బృంద సభ్యులకు సర్పంచ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వినతిపత్రాలు అందించారు. వేములదీవి గ్రామంలోనే జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఒడుగు ఏసు, వైసీపీ నాయకులు తిరుమాని నాగరాజు, బృందం సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:58:22+05:30 IST