తెలంగాణాలో విద్యకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-24T05:53:09+05:30 IST

రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.

తెలంగాణాలో విద్యకు అధిక ప్రాధాన్యం
పాఠశాల అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, సెప్టెంబరు 23:  రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం రాయికల్‌ పట్ట ణంలో మనబస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో కోటీ 31లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం పట్టణానికి చెందిన 11మంది లబ్ధి దారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 4లక్షల రూపాయల విలువ గ ల చెక్కులను, ముగ్గురు ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన 4 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంత రం రాయికల్‌ పెద్ద చెరువులో సమీకృత మత్య్స అభివృద్ధి పథకం కింద 100శాతం రాయితీతో 1లక్షా40వేల ఉచిత చేపపిల్లలను చెరువులో వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో పాఠశాలలను పట్టించుకునేవారు కా దని తెలంగాణా రాష్ట్రంలో మాత్రం విద్యకు ముఖ్యమంత్రి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. పాఠశాలల పూర్వ విద్యార్థులు, సామాజిక సేవకులను భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వీరివెంట మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, జడ్పీటీసీ అశ్విని, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, కమీషనర్‌ సంతోష్‌కుమార్‌, ఈఈ నారా యణరెడ్డి, డీఈ భాస్కర్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T05:53:09+05:30 IST