కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-21T21:53:43+05:30 IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందని ఇవాళ ఆయన వెల్లడించారు. ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ట్విటర్ వేదికగా పోఖ్రియాల్ స్పందిస్తూ.. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలుసుకున్న వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను...’’ అని పేర్కొన్నారు. కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాశాఖ కార్యకలాపాలను యధాతథంగా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా మరో 2 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 



Updated Date - 2021-04-21T21:53:43+05:30 IST