నవంబరు నుంచి నూతన విద్య

ABN , First Publish Date - 2021-10-26T05:02:31+05:30 IST

జిల్లాలో నూతన విద్యా విధానం అమలుకు ప్రణాళిక లు సిద్ధమయ్యాయి.

నవంబరు నుంచి నూతన విద్య

ఒకటి నుంచి అమలుకు ప్రణాళికలు

ప్రాథమిక విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు..

టీచర్‌ స్టూడెంట్‌ నిష్పత్తి 1:30 ఉండేలా చర్యలు


గుంటూరు(విద్య), అక్టోబరు 25: జిల్లాలో నూతన విద్యా విధానం అమలుకు ప్రణాళిక లు సిద్ధమయ్యాయి. ఇందులో తొలివిడత అ మలు చేసే ఫేజ్‌-1 కార్యాచరణకు సంబంఽ దించి మార్గదర్శకాలు త్వరలో జారీ కానున్నా యి. వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన విద్యా విధానం అమల్లోకి రానున్నది. ఈ ప్రకారం జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయనున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని ఉన్నత పాఠశాలలకు పంపుతారు. ఆయా ఉన్నత పాఠశా లల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతుంది. జిల్లాలో 150పైగా ఉన్నత పాఠశాలల్లో 220 ప్రాథ మిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు వచ్చి చేరనున్నారు. వీరి సంఖ్య దాదాపు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఆయా ఉన్నత పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకుంటే గదులు నిర్మించే వరకు విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగుతారు.


ఉపాధ్యాయ పోస్టింగ్‌లు ఇలా..

నూతన విద్యా విధానంలో పాఠశాలల్లో టీఆర్పీ(టీచర్‌ స్టూడెంట్‌ నిష్పత్తి) 1:30 ఉం డేలా అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. 1, 2 తరగతుల నిర్వహణకు ప్రాథమిక పాఠ శాలల్లో సర్వీసులో ఉన్న జూ నియర్‌ ఎస్‌జీటీలను అక్కడే ఉంచుతారు. ఒక వేళ సీని యర్‌ ఎస్‌జీటీలు 3 నుంచి 10 తరగతులు బోధించడానికి అర్హులు కాకుంటే అర్హత ఉన్న జూనియర్‌ ఎస్‌జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపుతారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ (అక్షరాసత్య తక్కువ ఉన్న ప్రాంతాల హెచ్‌ఎం)లకు ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో పని చేయడానికి ఆసక్తి ఉంటే అక్కడికి పంపుతారు. ఉన్నత పాఠశాలలకు వెళ్ళిన ఎస్‌జీటీ సర్వీస్‌ రూల్స్‌ మొత్తం ఆయా పాఠశాలల్లో హెచ్‌ఎంలు పర్యవేక్షిస్తారు. జిల్లాలో 3 నుంచి 10వ తరగతి ఉండే పాఠశాలల్లో ప్రతి టీచర్‌కు వారానికి గరిష్ఠంగా 32 క్లాసులు ఉంటాయి. ఉపాధ్యాయుల విద్యార్హతలను అనుసరించి అక్కడ బోధనకు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.  చైల్డ్‌ఇన్ఫో, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు డీఈవోకు ఈ నెల 31లోగా పంపాల్సి ఉంటుంది.  


Updated Date - 2021-10-26T05:02:31+05:30 IST