ఇన్‌చార్జీలతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-12-03T04:15:42+05:30 IST

విద్యా శాఖలో ఖాళీలు వెక్కిరిస్తు న్నాయి.

ఇన్‌చార్జీలతో ఇక్కట్లు
మహబూబ్‌నగర్‌ డీఈవో కార్యాలయం

- విద్యా శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీ పోస్టులు

- ఎంఈవోలు, జీహెచ్‌ఎంలకు ఇన్‌చార్జి బాధ్యతలు

- ఉపాధ్యాయులపై కొరవడిన పర్యవేక్షణ 8 గాడి తప్పుతున్న వ్యవస్థ


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం), డిసెంబరు 2 : విద్యా శాఖలో ఖాళీలు వెక్కిరిస్తు న్నాయి. జీహెచ్‌ఎంల నుంచి ఎంఈవోలకు వరకు అందరికీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్ప గించడంతో విద్యా వ్యవస్థ కుంటు పడుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. 


ఇవీ ఖాళీలు..


మహబూబ్‌నగర్‌ జిల్లాలో 110 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 85 మంది జీహెచ్‌ఎంలు ఉండగా, మిగిలిన 25 చోట్ల ఇన్‌చార్జీల ను నియమించారు. అలాగే 19 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలల్లో తొమ్మి ది మంది రెగ్యులర్‌ వారు ఉండగా, పది మంది ఇంచార్జిలే ఉన్నారు. వనపర్తి జిల్లాలో 86 ప్రభుత్వ పాఠశాలకు గాను 33 మంది రెగ్యులర్‌ జీహెచ్‌ఎంలు ఉన్నారు. మిగిలిన 53 చోట్ల ఇన్‌చార్జీలను నియమించారు. నాగర్‌కర్నుల్‌ జిల్లాలో 125 పాఠశాలకు గాను 75 మంది రెగ్యులర్‌ జీహెచ్‌ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 49 మంది ఇన్‌చార్జీలుగా పని చేస్తున్నారు. నారయణపేట జిల్లాలో 61 ఉన్నత పాఠశాలు ఉంటే 31 మంది గజిటెడ్‌ హెచ్‌ఎంలు ఉన్నారు. 29 మంది ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 83 ఉన్నత పాఠశాలలు ఉండగా 55 మంది రెగ్యులర్‌ జీ హెచ్‌ఎంలు ఉండగా, 28 మంది ఇన్‌చార్జీలుగా విధులు నిర్వహిస్తున్నారు.


జీహెచ్‌ఎంలకు ఇన్‌చార్జి ఎంఈవో బాధ్యతలు


మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 మండలాలు ఉండగా ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ ఎం ఈవోలు ఉన్నారు. మిగిలిన 13 చోట్ల ఇన్‌చార్జి ఎంఈవోలు కొనసాగుతున్నారు. ఒక్కో ఎంఈవో, ఇన్‌చార్జి ఎంఈవోకు రెండు మండలాలు కేటాయించారు. అయితే, ఇన్‌చార్జి ఎంఈవోలుగా పని చేస్తున్న జీహెచ్‌ఎంలు తమ పాఠశాలలను పట్టించుకోవడం లేద న్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల పరీక్షలు, స్వచ్ఛ విద్యాలయ, స్వచ్ఛభారత్‌ పర్య వేక్షణ తదితర పనుల్లో బిజీగా ఉంటూ, పాఠశాలలను పర్యవేక్షించడంలో విఫలమవు తున్నారు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులపై పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2020-12-03T04:15:42+05:30 IST