అనంతపురం జిల్లాలో 9న విద్యాసంస్థల బంద్

ABN , First Publish Date - 2021-11-09T02:53:55+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు ఏఐఎస్ఎఫ్ నాయకులు

అనంతపురం జిల్లాలో 9న విద్యాసంస్థల బంద్

అనంతపురం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని SSBN  విద్యాసంస్థల ఆవరణలో విద్యాసంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేసారు. లాఠీఛార్జికి నిరసనగా 9న జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరిగే జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని కోరారు.  ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. 

Updated Date - 2021-11-09T02:53:55+05:30 IST