ఏదులాపురం సొసైటీ చైర్మన్‌, డైరెక్టర్‌ తొలగింపు

ABN , First Publish Date - 2022-06-25T05:37:32+05:30 IST

మండల పరిధిలోని ఏదులాపురం సహకార సంఘం చైర్మన్‌, డైరెక్టర్‌ను పదవి నుంచి తొలగించారు. పలు అవినీతి అక్రమాలపై పత్రికల్లో పలు కథనాలను ప్రచురితమవం తెలిసిందే..

ఏదులాపురం సొసైటీ చైర్మన్‌, డైరెక్టర్‌ తొలగింపు

ఖమ్మంరూరల్‌, జూన్‌24: మండల పరిధిలోని ఏదులాపురం సహకార సంఘం చైర్మన్‌, డైరెక్టర్‌ను పదవి  నుంచి తొలగించారు. పలు అవినీతి అక్రమాలపై పత్రికల్లో పలు కథనాలను ప్రచురితమవం తెలిసిందే.. విచారణ చేపట్టి తొలగించారు. ఏదులాపురం సహకార సంఘంలో గత ఏడాది రబీలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో ధాన్యం కొనకుండానే కొనుగోలు చేసినట్లు రైస్‌ మిల్లర్లతో  కుమ్మక్కు అయి నాటి చైర్మన్‌ ఏనుగు ధర్మారెడ్డి సుమారు రూ.1కోటికి పైగా ప్రభుత్వ సోమ్మును కాజేశారు. దీనిపై ‘ఆంఽధ్రజ్యోతి’ ఆధారాలతో సహ కథనాలు ప్రచురించింది. ఈ అవినీతి అక్రమాలపై చైర్మన్‌ ధర్మారెడ్డిపై పాలకవర్గం సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. దీంతో చైర్మన్‌ను సదవి నుంచి జిల్లా అధికారులు సస్పెండ్‌ చేశారు. అదేవిదంగా సీఈవో నరసింహరావును కూడా సస్పెండ్‌ చేశారు. అనంతరం సహకార సంఘంలో  అవినీతి అక్రమాలపై కథనాలు ప్రచురించారు.ఈ విచా రణలో రూ.2.5 కోట్ల అవినీతి అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. దీంతో చైర్మన్‌ ఏనుగు ధర్మారెడ్డిని చైర్మన్‌ పదవితో పాటు, అతని డైరక్టర్‌ పదవి నుంచి అధికారులు తొలగించారు. కొండాపురం పరిధిలోని సీతారాంపురం గ్రామంకు చెందిన మరో డైరక్టర్‌ మట్టా వీరభద్రం కూడా ధాన్యం కొనుగోళ్ల సమయంలో క్వింటాకు రూ.5రూపాయల చొప్పున రైతుల నుంచి అక్రమంగా వసూల్‌ చేశాడు. సొసైటికి డబ్బులు కూడా జమ చేయలేదని అధికారుల విచారణలో తేలింది. దీంతో అధికా రులు ఆయన్ను డైరక్టర్‌ పదవి నుంచి తొలగించారు.  ఈ తొలగింపులను డీసీవో విజయకుమారి ధ్రువీకరించారు.

Updated Date - 2022-06-25T05:37:32+05:30 IST