అరవిందస్వామి సినిమాలో ఈషాకి ఛాన్స్..

Jun 12 2021 @ 14:48PM

అరవిందస్వామి సినిమాలో తెలుగమ్మాయి ఈషా రెబ్బాకి అవకాశం వచ్చిందని స్వయంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మలయాళం - తమిళ బైలింగ్వేల్ సినిమాతో ఈమె మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. 'ఒట్టు' అనే టైటిల్‌తో డైరెక్టర్ ఫెల్లిని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీని ద్వారా అరవింద్ స్వామి 25ఏళ్ల తర్వాత మలయాళంలో రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. కుంచాకో బోబన్ హీరోగా నటిస్తున్న ఇందులో ఈషారెబ్బా ఆయనకి జంటగా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. 'ఈ క్యారెక్టర్ నాకూ చాలా  కొత్తగా ఉంది. దీనికోసం చాలా మేకోవర్ అవ్వాల్సి ఉంది. ఈ క్యారెక్టర్‌లో నన్ను చూసి అందరు షాక్ అవుతారు. తెలుగు వాళ్లు కూడా నన్ను మరో కొత్త అవతారంలో చూడబోతున్నారని చెప్పగలను. అంతేకాదు ఈ సినిమా ఇద్దరు స్నేహితులు మధ్య అనుబంధం నేపథ్యంలో ఉండబోతుంది'.. అంటూ స్టోరీపై కూడా ఓ హింట్ ఇచ్చేసింది ఈషా.  త్వరలోనే గోవా ఫస్ట్ షెడ్యూల్‌లో ఈమె జాయిన్ కాబోతోంది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]rajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.