ప్రణాళికాబద్ధంగా అద్దంకి అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-09-30T05:14:39+05:30 IST

అద్దంకి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభి వృద్ధి చేస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

ప్రణాళికాబద్ధంగా అద్దంకి అభివృద్ధికి కృషి
బల్లికురవలో చేయూత మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకి, సెప్టెంబరు 29: అద్దంకి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభి వృద్ధి చేస్తున్నట్టు శాప్‌నెట్‌  చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. పట్టణంలోని 11,12,19 వార్డులలో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైన్‌ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ అద్దంకి పట్టణం లో అన్ని ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు తె లిపారు. 19వ వార్డు పరిధిలో పెరికపాలెం సమీపంలో 88 సర్వే నెంబ ర్‌లో కొత్తగా నిర్మాణం చేస్తున్న కాలనీలో చేతిబోర్ల ఏర్పాటును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేర మ్మ, వైస్‌ చైర్మన్‌లు దేసు పద్మేష్‌, అనంతలక్ష్మి, కమిషనర్‌ రవికుమార్‌, ఏఈ రోహిణి, కౌన్సిలర్‌ వేజెండ్ల నాగరాజు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణ మూర్తి, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి రమేష్‌, కొల్లా భువనేశ్వరి, వూడత్‌ సురేష్‌ తదతరులు పాల్గొన్నారు.


నిరుపేదలకు అండగా ప్రభుత్వం

బల్లికురువ, సెప్టెంబరు 29: సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదల కుటుంబాల ఉన్నతికి ప్రభుత్వం కృషిచేస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీ పీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గురు వారం బల్లికురవలో జరిగిన చేయూత పథకం చెక్కుల పంపిణీ కార్య క్రమానికి ఎంపీడీవో సీహెచ్‌ కృష్ణ అధ్యక్షత వహించారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా మండలంలో 2976 మంది లబ్ధిదారులకు రూ.5.58 కోట్ల చెక్కును అందజేసినట్టు చెప్పారు. కా ర్యక్రమంలో జడ్పీటీసీ చింతల అంజలి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చింతల పేరయ్య, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి వెంక ట్రావు, ఏపీఎం సురేంద్రబాబు, ఏపీవో నాయక్‌, వెలుగు ఏరియా కో ఆర్డినేటర్‌ రవికుమార్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నా యకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T05:14:39+05:30 IST