రౌట గ్రామాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-05-13T05:13:34+05:30 IST

కుమరంభీం పుట్టిన గ్రామమైన రౌట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆడిషనల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రౌటసంకెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌట గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటా మన్నారు. గ్రామంలో త్వరలోనే వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

రౌట గ్రామాభివృద్ధికి కృషి
వెదురు వస్తువులను పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 12: కుమరంభీం పుట్టిన గ్రామమైన రౌట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆడిషనల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రౌటసంకెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌట గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటా మన్నారు. గ్రామంలో త్వరలోనే వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాన్ని ముంబాయి నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంటామని పేర్కొనడంతో ఆ సంస్థ  ప్రతినిధులతో చర్చించి గ్రామాల స్థితిగతులను వివ రించారు. అనంతరం అడ్డఘాట్‌ గ్రామస్థులు తయారు చేసిన వెదురు వస్తువులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లిఖార్జున్‌, ఎంపీవో ప్రసాద్‌, ఏపీడీ రామకృష్ణ, ఏపీవో చంద్రశేఖర్‌, సర్పంచ్‌ విమల, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more