బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి

ABN , First Publish Date - 2022-05-23T03:59:06+05:30 IST

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది కేవలం బడుగు, బలహీనవర్గాల కోసమేనని గుర్తు చేశారు. టీడీపీ 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టి నిరుపేదలను ఆదుకున్నట్టు వివరించారు.

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి
మాట్లాడుతున్న టీడీపీ జాతీయ పోలిట్‌ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి

కాగజ్‌నగర్‌, మే 22: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం  నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది కేవలం బడుగు, బలహీనవర్గాల కోసమేనని గుర్తు చేశారు. టీడీపీ 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టి నిరుపేదలను ఆదుకున్నట్టు వివరించారు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం కుర్చీల కోసమే ఆరాట పడుతున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో అభివృద్ధి మాటున అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇంతటి అవీనితి పాలన ప్రభుత్వం ఎన్నడూ చూడలేదన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్‌ జోత్స మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు. పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి టీడీపీ హాయంలోనే జరిగిందన్నారు. మారుమూల గ్రామాల్లోని రోడ్లన్నీ గతంలో టీడీపీ హాయంలోనే వేసినవేనన్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని వివరించారు.  ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బి.సంజయ్‌ కుమార్‌, చిలువేరు రవీందర్‌, పెరుగు ఆత్మరాం, ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నార

Updated Date - 2022-05-23T03:59:06+05:30 IST