మేదరుల అభ్యున్నతికి కృషి

ABN , First Publish Date - 2021-09-19T04:08:35+05:30 IST

మేదరుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని, సీఎం కేసీ ఆర్‌ చేతి వృత్తిదారులను ఆదుకుంటున్నారని శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం జాతీయ వెదరు దినోత్సవం సందర్భంగా మేదరివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేతివృత్తిదారులను పట్టించుకోలేదని, జిల్లా కేంద్రంలో మేదరుల సంక్షేమ భవనం నిర్మాణానికి కృషిచేస్తానన్నారు.

మేదరుల అభ్యున్నతికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు

జాతీయ వెదరు దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 18: మేదరుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని, సీఎం కేసీ ఆర్‌ చేతి వృత్తిదారులను ఆదుకుంటున్నారని శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం జాతీయ వెదరు దినోత్సవం సందర్భంగా మేదరివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేతివృత్తిదారులను పట్టించుకోలేదని, జిల్లా కేంద్రంలో మేదరుల సంక్షేమ భవనం నిర్మాణానికి కృషిచేస్తానన్నారు.

అనంతరం ఇదే కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంఎల్‌సీ, ఏఐసీసీ సభ్యుడు ప్రేంసాగర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్‌, మేదరి సంఘం జిల్లా అఽధ్యక్షుడు సూరినేని కిషన్‌లు మాట్లాడుతూ వెదురు వనాలను సంరక్షించి ప్రభుత్వం మేదరులకు ఉచితం గా అందించాలన్నారు. 12ఏళ్లుగా వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నా వెదరు ఉత్పత్తికి ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రభుత్వం వెదురు ఉత్పత్తి పెంచి, మేదరిబంధు ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతంలో వందెకరాల విస్తీర్ణంలో వెదురును పెంచాలని డిమాండ్‌ చేశారు.  బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలకంఠేశ్వర్‌రావు, మేద రి సంఘం జిల్లా కార్యదర్శి సుభాష్‌, గైనిశంకర్‌, నాయకులు ఏకుల సత్యం అమర్‌నాథ్‌, శేర్ల సత్తయ్య, కొండ య్య, సుశీల, సతీష్‌, శశిధర్‌ పాల్గొన్నారు. 

జన్నారం: మేదరి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌ అన్నారు.  మం డల కేంద్రంలో మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించిన జాతీయ వెదురు దినోత్సవంలో మాట్లాడారు.  అడవిలో లభ్యమయ్యే వెదురుతో తయారు చేసిన వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలి పారు. టైగర్‌జోన్‌ ఏర్పాటు వల్ల అడ్డంకులు వచ్చా యని,  సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  మేదరులు ర్యాలీ నిర్వహించి తెలం గాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.  ఎంపీపీ సరోజన, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో రమేష్‌, అటవీ రేంజ్‌ అధికారులు ప్రణయ్‌, లక్ష్మీనారా యణ, సంఘం మండల అధ్యక్షుడు నర్సింగరావు, ఉపాధ్యక్షు డు నర్సయ్య, కార్యదర్శి పిల్లి మల్లయ్య, కోశాధికారి కోడిజుట్టు రాజన్న, మేదరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-19T04:08:35+05:30 IST