ఆంథోల్‌ మైసమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి

Jul 27 2021 @ 01:39AM

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 26: ఆంథోల్‌మైసమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండు మల్కాపురంలో 16వ బోనాల ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం పూర్ణాహుతి హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదనంతరం ఆయన మాట్లాడారు.  రోడ్డు విస్తరణకు  దేవాలయాన్ని తొలగించకుండా చూస్తానన్నారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ యాదగిరి, ఎంపీటీసీ శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌  కృష్ణ, ఈవో వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్‌గుప్తా పాల్గొన్నారు.Follow Us on: