బెక్కల్‌ రామలింగేశ్వరాలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-03-01T05:40:41+05:30 IST

బెక్కల్‌లోని రామలింగేశ్వరాలయాభివృద్ధికి సీజీఎఫ్‌ ఫండ్‌ ద్వారా దేవాదాయశాఖ సహకారంతో కృషి చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

బెక్కల్‌ రామలింగేశ్వరాలయ అభివృద్ధికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మద్దూరు, ఫిబ్రవరి 28 : బెక్కల్‌లోని రామలింగేశ్వరాలయాభివృద్ధికి సీజీఎఫ్‌ ఫండ్‌ ద్వారా దేవాదాయశాఖ సహకారంతో కృషి చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.  ఆదివారం మండలంలోని బెక్కల్‌ గ్రామంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం చైర్మన్‌ సంపత్‌ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఆలయ పున:నిర్మాణానికి సహకరించనున్నట్లు  పేర్కొన్నారు. దాతల సహకారంతో పాటు తనవంతుగా తన తల్లిదండ్రుల పేర ప్రత్యేకంగా గది ఏర్పాటుకు  కృషి చేయనున్నట్లుచెప్పారు. గుట్ట చుట్టూ సీసీ రోడ్డుకు కృషి చేయనున్నట్లు వివరించారు. 


కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిని గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల ఆశయం నెరవేరలేదన్నారు. కాళ్వేరం, మిషన్‌భగీరథ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రతీ మనిషిపై రూ.1.20లక్షల అప్పు చేశాడని స్పష్టం చేశారు.  రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను  ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షులు చెట్కూరి కమలాకర్‌, సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌, చేర్యాల మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగారావు నాయకులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-03-01T05:40:41+05:30 IST