గోపలాయపల్లి క్షేత్రం అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-05-20T05:50:20+05:30 IST

గోపలాయపల్లి వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తామని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

గోపలాయపల్లి క్షేత్రం అభివృద్ధికి కృషి
షెడ్డును ప్రారంభిస్తున్న మోహన్‌రెడ్డి, పక్కన జడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి

జడ్పీ చైర్మన్‌ బండా, ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్‌పల్లి, మే 19: గోపలాయపల్లి వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తామని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. క్షేత్ర సందర్శ నకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జడ్పీ నిధులు రూ.10 లక్షలతో గుట్టపై నిర్మించిన షెడ్డును గురువారం ప్రారంభిం చారు. వందల ఏళ్ల పురాతన చరిత్ర కల్గిన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్దరణ గావించి ఇతోధికంగా అభివృద్ధి చేస్తున్న దేవస్థాన అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కృషి అభినందనీ యమన్నారు. గుట్టపై ఆలయ పరిసరాల్లో నాటిన మొక్కలు, పచ్చికబయళ్లు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదభరిత వాతావరణం చూడముచ్చటగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, దేవస్థాన ఛైర్మన్‌ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ గోసుల భద్రాచలం, ఎంపీ టీసీ పాశం శ్రీనివాస్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మచ్చ ముత్యాలు, దోసపాటి విష్ణుమూర్తి, మచ్చ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-20T05:50:20+05:30 IST