కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-18T04:33:41+05:30 IST

సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి హరీశ్‌రావు సహకారంతో కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయనున్నట్లు ఆలయ చైర్మన్‌ జంబుల శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
బాధ్యతలను స్వీకరించిన కొండపోచమ్మ పాలకమండలి సభ్యులు

ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి సభ్యులు

జగదేవ్‌పూర్‌, ఆగస్టు 17: సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి హరీశ్‌రావు సహకారంతో కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయనున్నట్లు ఆలయ చైర్మన్‌ జంబుల శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. నూతనంగా నియామకమైన కొండపోచమ్మ చైర్మన్‌, పాలకమండలి సభ్యులు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. చైర్మన్‌తో పాటు పాలకమండలి సభ్యులను ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, రమేష్‌ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కొండపోచమ్మ జాతరకు ప్రతిఏటా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా త్వరలో ఆలయ పరిసరాల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. దాతల సహకారంలో కాటేజీలు (భవనాలు) నిర్మిస్తామన్నారు. త్వరలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను ఆలయ అభివృద్ధి పనుల గురించి కలవనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రజితారమేష్‌, ఈవో మోహన్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు దాచారం కనకయ్య, కనకారెడ్డి, జానకీరాములు, సంతోష్‌, రామచంద్రారెడ్డి, వెంకట్రాంరెడ్డి, కిషన్‌చారి, ఆలయ సిబ్బంది వెంకట్‌రెడ్డి, కనకయ్య, హరిబాబు, పూజారులు లక్ష్మణ్‌, కొండయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T04:33:41+05:30 IST