రామగుండం నగర అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-07-07T05:48:08+05:30 IST

రామగుండం నగరాన్ని కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

రామగుండం నగర అభివృద్ధికి కృషి
అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కోల్‌సిటీ, జూలై 6: రామగుండం నగరాన్ని కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. బుధవారం రామగుండం కార్పొరేషన్‌ 26వ డివిజన్‌ దుర్గానగర్‌లో రూ.20లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు, 34వ డివిజన్‌లో రూ.10లక్షలో నిర్మించనున్న యూజీ డీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ కూడళ్ల అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. సమస్యలు లేని రాష్ట్రంగా రూపుదిద్దా లనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు పరిష్కరించడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగరాలు, పల్లె లు సుందరంగా మారాయన్నారు. కరోనా సమయంలో రామగుండం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచి వైద్యసేవలు అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్ర మంలో మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, కమిషనర్‌ సుమన్‌రావు, కార్పొరేటర్లు మంచి కట్ల దయాకర్‌, జంజర్ల మౌనిక, బాల రాజ్‌కుమార్‌, ఇంజపురి పులేందర్‌, కొమ్ము వేణుగోపాల్‌, సాగంటి శంకర్‌, దొంత శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యులు వంగ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తానిపర్తి గోపాల్‌రావు, మెతుకు దేవరాజ్‌, కల్వల సంజీవ్‌, బాసాని స్వామిగౌడ్‌, అడప శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:48:08+05:30 IST