సిరిసిల్ల వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-07-07T06:28:10+05:30 IST

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వ ఆర్డర్లను అందించి ఉపాధి కల్పిస్తుందని చేనేత జౌళి శాఖ రాష్ట్ర కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాష్‌ అన్నారు.

సిరిసిల్ల వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కృషి
మరమగ్గాలను పరిశీలిస్తున్న కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌

- చేనేత, జౌళి శాఖ రాష్ట్ర కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాష్‌

సిరిసిల్ల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వ ఆర్డర్లను అందించి ఉపాధి కల్పిస్తుందని చేనేత జౌళి శాఖ రాష్ట్ర కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాష్‌ అన్నారు. బుధవారం సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమతో పాటు అనుబంధ రంగాలు, టెక్స్‌టైల్‌ పార్కు, అపెరల్‌ పార్కు, గార్మెంట్‌ ఫ్యాక్టరీలను పరిశీలించారు. కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. బతుకమ్మ చీరలు, స్కూల్‌ యూనిఫాం, వస్త్రోత్పత్తిని వేగవంతం చేసి నిర్ణీత సమయంలో అందించాలని అన్నారు. వార్ఫిన్‌, వైపని, డైయింగ్‌ ప్రాసెసింగ్‌, గ్రూప్‌ వర్క్‌షెడ్‌, గార్మెంట్‌ ప్యాక్టరీలను పరిశీలించారు. మరమగ్గాలు, అనుబంధ రంగాల్లోని పరిశ్రమల తీరును స్వయంగా తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌, చేనేత జౌళి శాఖ డీడీ అశోక్‌రావు, సిరిసిల్ల ఏడీలు తస్లీమా, సాగర్‌లు ఉన్నారు. 


Updated Date - 2022-07-07T06:28:10+05:30 IST