పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : ఎమ్మెల్యే

Sep 27 2021 @ 00:18AM
చంద్రశేఖర్‌రెడ్డిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

ఆమనగల్లు : పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన చంద్రశేఖర్‌రెడ్డికి ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. కాగా, తనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌లకు చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జగన్‌రెడ్డి, జయమ్మవెంకటయ్య, నాగమణిలింగంగౌడ్‌, రాజు, జంగయ్య, లింగంయాదవ్‌, రవీందర్‌, అనంతరాములు, విజేందర్‌, రమేశ్‌, సైదులు, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: