నేరాల నియంత్రణకు కృషి

ABN , First Publish Date - 2022-09-24T06:10:31+05:30 IST

నేరాల నియంత్రణ కు కృషి చేయాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.

నేరాల నియంత్రణకు కృషి
మొక్కకు నీరుపోస్తున్న ఎస్పీ రెమారాజేశ్వరి

దేవరకొండ, సెప్టెంబరు 23: నేరాల నియంత్రణ కు కృషి చేయాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఎస్‌ఐ నారాయణరెడ్డిని కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండమల్లేపల్లితోపా టు గ్రామాల్లో సీసీ కెమెరాల సంఖ్య పెంచాలన్నారు. పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అనంతరం కొండమల్లేపల్లి పోలీ్‌సస్టేషన్‌ ఆవరణంలో మొక్కలునాటి మాట్లాడారు. ఎస్పీ వెంట దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు,సీఐ రవీందర్‌ ఉన్నారు.  

Updated Date - 2022-09-24T06:10:31+05:30 IST