మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2022-06-30T04:59:19+05:30 IST

రైల్వేస్టేషన్లలో మరింత మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తా మని రైల్వేశాఖ వాల్తేరు డివిజన్‌ డీఆర్‌ఎం అనూప్‌ శతపతి పేర్కొన్నారు. బుధ వారం నౌపడ రైల్వే జంక్షన్‌, పాతపట్నం రైల్వే స్టేషన్‌ను, గుణుపూర్‌ రైలు మార్గాన్ని ఆయన పరిశీలించారు. స్టేషన్లలో మౌలిక వసతులపై ఆరా తీశారు.

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ శతపతి

టెక్కలి/పాతపట్నం, జూన్‌ 29:
రైల్వేస్టేషన్లలో మరింత మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తా మని రైల్వేశాఖ వాల్తేరు డివిజన్‌ డీఆర్‌ఎం అనూప్‌ శతపతి పేర్కొన్నారు. బుధ వారం నౌపడ రైల్వే జంక్షన్‌, పాతపట్నం రైల్వే స్టేషన్‌ను, గుణుపూర్‌ రైలు మార్గాన్ని ఆయన పరిశీలించారు. స్టేషన్లలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఫ్లాట్‌ఫారం పరిస్థితి, ఇతర విభాగాలతో పాటు రైల్వేట్రాక్‌ను పరిశీలించారు. నౌపడ రైల్వేస్టేషన్‌ సమీపంలో పారిశుధ్య లోపంపై ఆయన స్పందిస్తూ.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నౌపడ- గుణుపూర్‌ బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాన్ని పరిశీలించామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రద్దు చేసిన పలు రైళ్లను ఇటీవల పునరుద్ధరించామని తెలిపారు. రైలు ట్రాక్‌, స్టేషన్లలో మౌలిక వసతులు, పారిశుధ్యం తదితర అంశాలపై రైల్వే అధికారులతో చర్చించామన్నారు. టెక్కలి రైల్వేస్టేషన్‌లో రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల అంశం పరిశీలనలో ఉందన్నారు. అలాగే పాతపట్నంలో రాజారాణి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్‌ కల్పించాలని స్థానిక నాయకులు డీఆర్‌ఎం అనూప్‌ శతపతిని కోరారు. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం ఎత్తుచాలక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్‌, మరుగు దొడ్లు సమస్యలు పరిష్కరించాలని, ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని విస్తరించాలని కోరారు. తెంబూరు రైల్వేస్టేషన్‌లో పూరీ-గుణుపూర్‌, రాజా-రాణి ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్‌ ఇవ్వాలని స్థాని కులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బొత్స నారాయణమూర్తి వైస్‌ ఎంపీపీ ఎస్‌.ప్రదీప్‌, సర్పంచ్‌ బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-30T04:59:19+05:30 IST