హిరాసుక్క జయంతి నిధులకు కృషి

ABN , First Publish Date - 2021-02-28T05:32:19+05:30 IST

ఆదివాసీ గిరిజనుల గోండ్‌ ఽధర్మ గురువు హిరాసుక్క జయంతిని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. శనివారం ఉట్నూర్‌ లో ఆయన ప్రధాన్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హిరాసుక్క జయంతికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

హిరాసుక్క జయంతి నిధులకు కృషి
జెండాను ఆవిష్కరిస్తున్న జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌

ఉట్నూర్‌, ఫిబ్రవరి27: ఆదివాసీ గిరిజనుల గోండ్‌ ఽధర్మ గురువు హిరాసుక్క జయంతిని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. శనివారం ఉట్నూర్‌ లో ఆయన ప్రధాన్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హిరాసుక్క జయంతికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధర్మ రక్షణ కోసం సమాజాన్ని మేల్కొల్పిన మహానీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్లాల న్నారు. భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు అందేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆదివాసీ గిరిజనులు దేవ మడావి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఆయన హిరాసుక్క జెండాను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జైవంత్‌రావు, శేషనారాయణ, మేస్రం మనోహార్‌, సిడాం భీంరావు, కబీర్‌దాస్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్య లేని గ్రామాలుగా మారుస్తాం

నార్నూర్‌: రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ అందించేందుకు కృషి చేస్తోందని, విద్యుత్‌ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతా మని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. శనివారం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలో గల గణపతికూడ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన త్రిఫేస్‌ విద్యుత్‌ లైన్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 15 విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాలు ఉండగా 9 గ్రామాల్లో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. రూ.7కోట్ల 16లక్షల వ్యయంతో సింగల్‌ ఫేస్‌ విద్యుత్‌ నుంచి త్రిఫేస్‌కు మార్చడం జరిగిందన్నారు. ఇందులో జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి ఉత్తంజాడే, ఏడీ దేవాగౌడ్‌ వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌ జాదవ్‌రాథోడ్‌, రామేశ్వర్‌, కనక ప్రభాకర్‌, దుర్గే మహేందర్‌, కాంతారావు, రాథోడ్‌విష్ణు, దాదేఆలీ, ఏఈ కదీర్‌, లైన్‌మెన్‌ నర్సయ్య, తారాచంద్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-02-28T05:32:19+05:30 IST