Advertisement

బాలల రక్షణకు కృషి

Sep 16 2020 @ 05:07AM

గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించండి

ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశం


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 15 : బాలల రక్షణకు సంబంధించి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. బాలల సంరక్షణ అధికారులు, సిబ్బందితో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలలపై అఘాయిత్యాలు జరుగుతున్న ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. చైల్డ్‌లైన్‌, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాల్య వివాహాలను నియంత్రించాలని..తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలన్నారు.


జూమ్‌ యాప్‌లో అన్ని పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో మాట్లాడారు. అనంతరం చైల్డ్‌లైన్‌ లోగోతో రూపొందించిన ఫేస్‌ మాస్క్‌ను ఎస్పీ అందరికీ అందించారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో జగన్నాథరావు, అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు, సీడబ్ల్యుసీ చైర్‌పర్సన్‌ నరసింహమూర్తి, డీసీపీవో రమణ, బచ్‌పన్‌ బచావో స్టేట్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, కార్మిక శాఖ అధికారి పురుషోత్తం, చైల్డ్‌లైన్‌ నోడల్‌ కోఆర్డినేటర్‌ సింహాచలం పాల్గొన్నారు. వైరస్‌ బారిన పడి కోలుకున్న 40 మంది పోలీస్‌ సిబ్బంది మంగళవారం విధులకు హాజరుకాగా..ఎస్పీ వారిని ఆత్మీయంగా స్వాగతం పలికి  సత్కరించారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.