ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-09-27T04:53:50+05:30 IST

ప్రజావాణి కార్యక్రమంద్వారా ప్రజలు చేసు కున్న దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషిచేస్తారని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారులనుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26: ప్రజావాణి కార్యక్రమంద్వారా ప్రజలు చేసు కున్న దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషిచేస్తారని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారులనుంచి దరఖాస్తులను స్వీకరించారు. పెంచికలపేట ఎల్లారం గ్రామానికి చెందిన కొందరు తాము 30సంవత్సరాల క్రితం ఫరీద్‌అహ్మద్‌ పట్టాదారువద్ద భూమిని కొనుగోలు చేసి అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నామన్నారు. ఇప్పుడు కొందరు తప్పుడు పట్టాలు సృష్టించి ఆ భూమి మాదేనని తెలుపుతూ నోటీసులు పంపించారని, ఈ విష యంలో న్యాయంచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కెరమెరి మండ లం అగరువాడ గ్రామానికి చెందిన ఆదెఅఖిల్‌ తానుపుట్టుకతో దివ్యాంగుడినని సదరన్‌ సర్టిఫికేట్‌తోపాటు పెన్షన్‌ మంజూరు చేయాలని అర్జీ సమర్పించాడు. సిర్పూర్‌(టి) మండలం పారిగాం గ్రామానికి చెందిన గోండుబావుజీ తాను పది సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటున్నానని, ఆన్‌లైన్‌లో ఇతరుల పేర్లు నమోదయ్యాయని, తప్పును సవరించాలని కోరుతూ దరఖాస్తు సమ ర్పించారు. ఆసిఫాబాద్‌ మండలం చోర్‌పల్లికి చెందిన బాబురావు నిరుపేదనైన తనకు జ్యోతిబాఫూలే గురుకులంలో ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్‌ మండలం మాలన్‌గొంది గ్రామానికి చెందిన షేక్‌ బాయ్‌ తనతల్లి పేరిట ఉన్న భూమిని తనపేరిట విరాసత్‌ చేయాలని కోరు తూఅర్జీ సమర్పించారు. రెబ్బెనమండలం నవేగాంకిచెందిన మహాత్మ గౌరయ్య నాలుగుతరాలుగా వంశపారంగా వస్తున్నభూమిలో తనవాటాను ఇప్పించాలని పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.

Updated Date - 2022-09-27T04:53:50+05:30 IST