వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-01-16T06:27:53+05:30 IST

వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీనిచ్చారు.

వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషి
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కవిత

 ఎమ్మెల్సీ కవిత హామీ 

 క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 15: వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీనిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా వీఆర్‌ఏల సంఘ నాయకులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాస గృహంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సంఘ క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరగా ఆమె స్పందిస్తూ, సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీనిచ్చారు. అలాగే రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ను వీఆర్‌ఏలు కలిసి సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమాల్లో సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జంగయ్య, రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, ఉపాధ్యక్షుడు గైని దయాసాగర్‌, నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్ల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:27:53+05:30 IST