కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి : రవి

Published: Mon, 27 Jun 2022 01:33:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి : రవివడ్డెపల్లి రవికి పార్టీ కండువా కప్పుతున్న ఎంపీ కోమటిరెడ్డి

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 26 : కాం గ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని డాక్టర్‌ వడ్డెపల్లి రవి అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా వడ్డెపల్లి రవి మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలతో కార్యకర్తలతో కలిసి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.