ఛీఛీ.. మూత్రంలో గుడ్లను ఉడికించి తినడమేంటని అవాక్కవుతున్నారా..? ఎన్ని లాభాలున్నాయని వీళ్లు నమ్ముతున్నారంటే..

ABN , First Publish Date - 2021-10-01T21:33:35+05:30 IST

డ్రాగన్ దేశ ప్రజలు తినే ఆహారపదార్థాలు గురించి చెప్పమంటే.. వాళ్లు కుక్కలను మొదలుకొని బొద్దికలను వరకూ ఏదీ వదలరు. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. విషయం ఇక్కడతో ఆ

ఛీఛీ.. మూత్రంలో గుడ్లను ఉడికించి తినడమేంటని అవాక్కవుతున్నారా..? ఎన్ని లాభాలున్నాయని వీళ్లు నమ్ముతున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: డ్రాగన్ దేశ ప్రజలు తినే ఆహారపదార్థాలు గురించి చెప్పమంటే.. వాళ్లు కుక్కలను మొదలుకొని బొద్దికలను వరకూ ఏదీ వదలరు. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. విషయం ఇక్కడతో ఆగిపోలేదు. వర్జిన్ బాయ్ ఎగ్ పేరుతో వాళ్లు చేసే ఓ వంటకం గురించి తెలిస్తే.. కడుపులో తిప్పడం తథ్యం. పదేళ్ల లోపు వయసున్న పిల్లల నుంచి సేకరించిన మూత్రం‌తో చేసిన వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారట. ఇందు కోసం వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున బకేట్లను పేర్చి చిన్నారుల నుంచి మూత్రం సేకరిస్తారట. అసలు టాయిలెట్ స్మెల్ వస్తేనే మనలో చాలా మంది అన్నం ముందు నుంచి లేచెళ్లిపోతారు. కానీ.. చైనా వారు మాత్రం మూత్రంతో తయారు చేసిన వంటకాలను మురిసిపోతూ తినేస్తుంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో.. మూత్రంలో నానబెట్టి, ఆ తర్వాత ఉడికించిన గుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తారట. virgin boy eggs అని పిలిచే ఈ వంటకాలను తయారు చేయడానికి ప్రత్యేకించి.. 10ఏళ్లలోపు వయసున్న మగపిల్లల మూత్రమే కావాలట. అధిక మొత్తంలో మూత్రం సేకరించడానికి అక్కడి వాళ్లు పాఠశాలలను ఆశ్రయిస్తారట. పాఠశాలలకు వెళ్లి, బకెట్ల ద్వారా పెద్ద మొత్తంలో విద్యార్థుల మూత్రాన్ని సేకరించి.. ఆ తర్వాత అందులో గుడ్లను సుమారు 7 గంటలపాటు నానబెడతారట. అనంతరం వాటిని ఉడికిస్తారట. చల్లారిన తర్వాత గుడ్డపై పెంకును తీసేసి.. ఉడికిన గుడ్డుతో ప్రత్యేక వంటకాలను తయారు చేస్తారట. ఇలా తయారు చేసిన వంటకాల టేస్ట్ బాగుండటం.. అంతేకాకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో అక్కడి వాళ్లు ఎగబడి మరీ ఈ వంటకాలను తింటారట. 



ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..

మూత్రంలో నానబెట్టిన గుడ్లను తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గడంతోపాటు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని అక్కడి వాళ్ల నమ్మకం. ఒకరి మూత్రంలో ఏడు రోజులపాటు గుడ్లను ఉంచి.. వాటిని సుమారు 3 నెలలపాటు తింటే దీర్ఘకాలిక ఆస్తమా కూడా తగ్గుతుందనేది అక్కడి పూర్వీకుల విశ్వాసంగా చేబుతారు. కాగా.. చిన్నపిల్లల మూత్రానికి చాలా శక్తి ఉంటుందని అక్కడి వాళ్లు అభిప్రాయపడుతుంటారు. ఈ మూత్రంతో ప్రత్యేకంగా టానిక్ కూడా తయారు చేస్తూ అక్కడ విరివిగా ఉపయోగారు. యూరిన్ థెరపీ అనేది అక్కడి సంప్రదాయ వైద్యంలో ఒక భాగమని చెబుతుంటారు.


Updated Date - 2021-10-01T21:33:35+05:30 IST