పురుషుడు కాదు..మహిళే..గర్భవతి కూడా..! ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు!

ABN , First Publish Date - 2021-05-02T01:28:33+05:30 IST

పురాతన ఈజిప్ట్ మమ్మీ.. ఈ మమ్మీ ఒక పురుషుడిదని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ..అది నిజం కాదని తాజాగా తేలింది.

పురుషుడు కాదు..మహిళే..గర్భవతి కూడా..! ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు!

ఇంటర్నెట్ డెస్క్: పురాతన ఈజిప్ట్ మమ్మీ..ఈ మమ్మీ ఒక పురుషుడిదని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ..అది నిజం కాదని తాజాగా తేలింది. వాస్తవానికి ఆ మమ్మీ ఓ మహిళ అని..చనిపోయే నాటికి ఆమె గర్భంతో ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 19వ శాతాబ్దంలో పోలాండ్‌లోని నాసెంట్ యూనివర్శిటీ ఆఫ్ వార్సా శాస్త్రవేత్తలు ఈ మమ్మీని గుర్తించారు. ఆ తరువాత యూనివర్శిటీకి తరలించారు. కాగా.. వార్సా మమ్మీ ప్రాజెక్టులో సభ్యురాలైన మార్జెనా ఒజారెక్ స్టిల్కే అనే శాస్త్రవేత్త ఈ మమ్మీకి ఇటీవల సీటీ స్కాన్ నిర్వహించారు. ఈ క్రమంలో బయటపడ్డ ఓ విషయం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘మమ్మీ జననేంద్రియాలను పరిశీలిస్తుండగా.. అక్కడ పాదం లాంటి ఆకారం ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్త అయిన నా భార్తకు తెలిపాను. ఆయన కూడా నా అనుమానం నిజం అని తెలిపారు. నీవు చూస్తున్నది నిజమే. ఈ మమ్మీ గర్భవతి. తన కడుపులో బిడ్డ ఉంది. పిండం వయసు దాదాపు 7 నెలల అయి ఉండొచ్చు’’ అని భర్త తనతో అన్నట్టు ఒజారెక్ తెలిపారు. ఆధునిక వైద్యం అందుబాటులోలేని అప్పటి కాలంలో..ప్రసవం అంటే పునర్జన్మగా భావించే వారని ఆమె తెలిపారు. ఈ మమ్మీని మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా అప్పటి కాలమాన పరిస్థితులపై మరింత అవగాహన కలుగుతుందని చెప్పారు. 

Updated Date - 2021-05-02T01:28:33+05:30 IST