రోగులకు ఈ-ఆస్పత్రి తిప్పలు

ABN , First Publish Date - 2022-08-19T05:21:24+05:30 IST

జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఈ-ఆస్పత్రి విధానం అమలుతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆనలైనలో నమోదు చేస్తే భవిష్యత్తులో ఆ రోగికి అవసరమైన సేవలు అందించడా నికి అవకాశం ఉంటుందని ఈ-ఆస్పత్రి విధానం తీసుకొ చ్చాయి

రోగులకు ఈ-ఆస్పత్రి తిప్పలు
ఓపీ కోసం క్యూలో నిలుచున్న మహిళలు


 


మొరాయించిన నెట్‌.. గంటల తరబడి ఓపీకి క్యూ.. వైద్యుల నిర్ణయంపై మండిపాటు

అనంతపురం టౌన, ఆగస్టు18: జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఈ-ఆస్పత్రి విధానం అమలుతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆనలైనలో నమోదు చేస్తే భవిష్యత్తులో ఆ రోగికి అవసరమైన సేవలు అందించడా నికి అవకాశం ఉంటుందని ఈ-ఆస్పత్రి విధానం తీసుకొ చ్చాయి. ఈ ఏడాది మార్చిలో జిల్లా సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుత కలెక్టర్‌ నాగలక్ష్మి ఈ-ఆస్పత్రి సేవలను ప్రారంభించారు. ప్రారంభం తర్వాత ఈ సేవలు మొదలు కాలేదు. అవసరమైన సాంకేతిక పరికరాలు లేకపోవడంతో పట్టించుకోలేదు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు గురువారం జిల్లా ఆస్పత్రిలో ఈ-ఆస్పత్రి సేవలు పునఃప్రారంభించారు. అయితే సర్వర్‌ సమస్య వెంటాడుతూ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాధులతో బాధపడుతూ చూపించుకోవడానికి జిల్లా ఆస్పత్రికి వందలాది మంది వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ఓపీ చీటీల కోసం క్యూ కట్టారు. ఓపీ చీటీలు ఈ-ఆస్పత్రి విధానంలో ఇవ్వడానికి సిబ్బంది ప్రయత్నించారు. రోగిపేరు, ఆధార్‌ నంబర్‌, ఊరి పేరు, ఫోన నంబర్‌తో పాటు ప్రస్తుతం ఉన్న జబ్బు వివరాలు అడిగి తెలుసుకొని ఈ-ఆస్పత్రి విధానంలో నమోదు చేయాలి. అయితే నెట్‌ పనిచేయక ఓపీ చీటీలు ఇవ్వలేకపోయారు. గంటల కొద్ది రోగులు ఓపీ కేంద్రాల వద్ద చీటీల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. చంటి బిడ్డలతో పాటు సీరియస్‌ కేసులతో వచ్చిన రోగులు, వారి బంధువులు ఓపీ చీటీలు గంటల కొద్ది ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతూ కనిపించారు. ఈ విషయం   ఆర్‌ఎంఓలు డాక్టర్‌ విజయమ్మ, డాక్టర్‌ వైవీరావు దృష్టికి తీసుకెళ్లడంతో వారు సూపరింటెండెంట్‌ సుధాకర్‌ వద్దకు వెళ్లి సమస్యను తెలిపారు. వెంటనే ఈ-ఆస్పత్రి విధానాన్ని వదిలేసి మామూలు ఓపీలు ఇవ్వాలని ఆదేశించారు.  సరైన సౌకర్యాలు లేకుండానే కొత్తవిధానానికి శ్రీకారం చుట్టి ఇబ్బంది పెట్టడంపై పలువురు రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-19T05:21:24+05:30 IST